మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడం గురించి వినడమేగానీ చూడటం చాలా అరుదు.. అయితే మధ్యప్రదేశ్ బాగాలఘాట్ జిల్లాలో ఒక మొబైల్ రిపేర్ షాపులో మొబైల్ రిపేర్ చేస్తుండగా బ్యాటరీ పేలింది. ఈ దృశ్యం సిసి కెమెరాలో రికార్డ్ అయింది. ఓ వ్యక్తి తన ఫోన్ పనిచేయడంలేదని , బంటి మొబైల్స్ షాపుకు తీసుకొచ్చాడు. టెక్నీషియన్ దాన్ని తీసుకొని రిపేర్ చేసేందుకు , వెనుక బ్యాటరీ కవర్ ఓపెన్ చేసాడు. వెంటనే పెద్దశబ్దంతో ,పేలుడు మంటలు వచ్చాయి. క్షణాల్లో టెక్నీషయన్ మొబైల్ ని విసిరేసాడు. ఈ పేలుడు ఎవరికీ గాయాలు కాలేదు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.. అయితే మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలుడు వీడియో చూస్తేమాత్రం , పెద్ద ఎత్తున ఆస్తి , ప్రాణ నష్టం జరిగినంత భయానకంగా ఉంది.. వీడియో చూడండి..
#MadhyaPradesh: Cellphone #battery explodes in flames in #Balaghat #ViralVideo #MPNews #MobileBlast #Shocking #Viral #MobileShop #Explosion #MobileBattery pic.twitter.com/BJXnsvf1Pn
— Free Press Journal (@fpjindia) August 18, 2022