బుల్డోజర్ బాబా గా యుపి సీఎం యోగికి పేరుంది.. నేరాలు చేసిన వాళ్ళు , తప్పించుకుతిరిగే నేరస్తుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చేయడం యుపి యోగి పాలనలో కొత్త ట్రెండ్.. అయితే ఇప్పుడు , ఒకకేసుకు సంబంధించి కోడలిని , అత్తగారింట్లోకి పంపేందుకు , పోలీసులు బుల్ డోజర్ తెచ్చారు.. నీలిమ అనే యువతి భర్తను 2019 లో కోర్టు జైలుకు పంపింది. అదనపు కట్నంకోసం భర్తపై నీలిమ పెట్టిన కేసులో , అతడు జైలుకెళ్లాడు. అప్పుడు , ఆమెను అత్తామామలు , ఇంటినుంచి గెంటేశారు., తరువాత , ఆమె హైకోర్టులో కేసు దాఖలు చేసింది.
తనకు అత్తగారింట్లో ఉండే హక్కు కల్పించాలని కోరింది. దీంతో కోర్టుకూడా ఆదేశాలిచ్చింది. అయితే , కోర్టు ఆదేశాలతో ఆమె అత్తగారింటికి పొతే , వాళ్లు గేట్లు మూసేసి , కుక్కలను వదిలిపెట్టారు. దీంతో ఆమె మళ్ళీ కోర్టుకెళ్లింది. కోర్టు పోలీసులకు ఆదేశాలిచ్చింది. నీలిమకు అత్తగారింట్లో ఉండే హక్కు కల్పించాలని ఆదేశించింది. అయితే , మళ్ళీ ఇంటి గేట్లు వేసి , కుక్కలను వదలడంతో , పోలీసులు జెసిబి తెప్పించి , గేట్లు పగులకొట్టి , కోడలిని లోపలకు పంపుతున్నామని చెప్పారు.. దీంతో భయపడ్డ అత్తామామలు కోడలిని ఇంట్లోకి అనుమతించారు.. బిజునూర్ లో జరిగిందీ ఘటన..
ఇవి కూడా చదవండి..