పెళ్లి విందులో అప్పడం కోసం ఫైటింగ్.. గాయాలు.కేసులు..

    0
    9333

    పెళ్ళి విందులో అప్పడం కోసం జరిగిన ఫైటింగ్ లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.. 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు.. కేరళలోని అలపూజ జిల్లా హరిపడ అనే టౌన్లో జరిగిన పెళ్ళిలో అదనంగా అడిగిన అప్పడం కోసం యుద్ధమే జరిగింది.. పెళ్లి విందులో పెళ్ళికొడుకు స్నేహితులు , అదనంగా మరొక అప్పడం వేయమన్నారు.. అలా వేయడం కుదరదని సర్వర్లు చెప్పారు. దీంతో గొడవ జరిగింది.

     

    పెళ్లికూతురు తరఫువాళ్ళు , అన్యాయంగా అప్పడం అడిగి , ఇవ్వలేదని సర్వర్ ని కొట్టడం ఏమిటంటూ పెళ్ళికొడుకు స్నేహితులను నిలదీశారు.. దీంతో ఈ గొడవ , పెళ్ళికొడుకు , పెళ్లికూతురు వర్గాల మధ్య తగాదాగా మారింది. కుర్చీలు విసిరేసి , బల్లలు పగలకొట్టారు. పెళ్లిమండపం ఓనర్ మురళీధరన్ అడ్డువచ్చి , ఇరు వర్గాలకు నచ్చజెప్పబోతే , ఆయనను తలపగలకొట్టి తీవ్రంగా గాయపరిచారు.. గొడవ జరుగుతుండగానే పెళ్లయిపోయింది..

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.