గోరంట్ల విశ్వరూపం కేసు.. ఐపోయా..

  0
  1270

  గోరంట్ల మాధవ్ వీడియోపై పోలీసుల దర్యాప్తు పూర్తి..
  అనంతపురం పోలీసులు ఏమన్నారంటే..?
  ==================================
  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై దుమారం రెజినా విషయం తెలిసిందే.. అయితే ఈ వ్యవహారంపై అనంతపురం పోలీసులు ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో సంచలనం విషయాలను వెల్లడించారు. ఆ లేఖలో ఏమున్నాయో యధాతధంగా మీరే చూడండి..

  హిందూపురం ఎం.పి గోరంట్ల మాధవ్ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేసినట్లు ఎం.పి అభిమాని అయిన కొనతాలపల్లి వెంకటేశ్వరరావు తండ్రి కె. రామయ్య, అనంతపురం అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 4 వ తేదీన క్లైం నంబర్ 18/2022, sec 67 A, 66 E of IT act, sec 292, 509 of IPC కేసు నమోదు చేయడం జరిగింది.

  > ఇంతవరకు లభించిన సమాచారం మేరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మొట్ట మొదటిగా iTDP official అనే వాట్సాప్ గ్రూపులో ఈనెల 4 వ తేదీ మధ్యరాత్రి 02:07 am గంటలకు + 447443703968 నంబర్ నుండీ తొలిగా సదరు వీడియోను పోస్ట్ చేసినట్లు తేలింది.

  > ఈ వీడియో పోస్ట్ చేసే కొన్ని క్షణాల ముందు iTDP official అనే వాట్సాప్ గ్రూపులో సదరు నంబర్ అయిన + 447443703968 ను యాడ్ చేయడం జరిగింది.

  > సదరు నంబర్ U.K ( United kingdom) వొడాఫోన్ కు సంబంధించినదిగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయ్యింది.

  > తదుపరి దర్యాప్తులో భాగంగా సోషల్ మీడియోలో తొలిసారిగా వీడియోను పోస్ట్ చేసిన సదరు నంబర్ ఇంటర్నేషనల్ నంబర్ కావడం వల్ల ఆ నంబర్ కు సంబంధించిన వ్యక్తి, వివరాలు సేకరించే పనిలో కొనసాగుతోంది.

  > సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు. ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోను ఇంకొకరికి పంపించి ఆ వ్యక్తి తన మొబైల్ లో చూస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆయన మొబైల్ ఫోన్ లోని వీడియోను చిత్రీకరించి ఆ వీడియోను వైరల్ చేయడమైనది.

  > ఈ వీడియో సోషల్ మీడియాలో పలు సార్లు ఫార్వర్డ్ మరియు రీ పోస్ట్ చేయడం జరిగింది. చాలాసార్లు ఈ వీడియోను ఫార్వర్డ్ మరియు రీ పోస్ట్ చేయడం వల్ల ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నాం.

  > సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్న ఈ వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి.

  ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.

  జిల్లా పోలీసు కార్యాలయం, అనంతపురం.

   

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.