బుగ్గలు కొరికేస్తున్నాడు, భార్య ఫిర్యాదు.

  0
  2175

  నా మొగుడు బుగ్గలు కొరికేస్తున్నాడు..పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య..కృష్ణా జిల్లాలో ఓ విచిత్రమైన కేసు నమోదైంది.. ఎప్పుడూ చూడని కేసును చూసి పోలీసులే ఖంగుతిన్నారు. తన భర్త రోజూ తన బుగ్గలు కొరికేస్తున్నాడని ఓ భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. కేసు పెట్టాల్సిందేనంటూ ఆ మహిళ భీష్మించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక కేసు నమోదు చేశారు..

  భార్యా భర్తలు గొడవలు పడటం.. మళ్ళీ కలిసి పోవడం మనం చూస్తూనే ఉంటాం.. అందుకే భార్యా భర్తల మధ్య గొడవల్లో ఎవరూ కలుగ జేసుకోవద్దని కూడా మన పెద్దలు చెబుతుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఆ గొడవలు శృతిమించి పోలీసు స్టేషన్ వద్దకు చేరుతుంటాయి. అటువంటప్పుడు పెద్దలు సర్దిచెప్పి.. పంచాయితీ చేసి రాజీలు చేస్తుంటారు.

  కృష్ణా జిల్లాలోని కానూరుకు చెందిన స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు. అయితే గతకొద్ది రోజులుగా సజావుగా సాగుతున్న వీరి కాపురంలో కొన్ని గొడవలు జరిగాయి. రాంబాబు మద్యానికి బానిసై.. కాస్తంత హార్డ్ గా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా రాంబాబు మద్యం మత్తులో భార్య స్రవంతి బుగ్గలు గట్టిగా కొరికేశాడు. అయితే రాంబాబుకు ఇలా బుగ్గలు కొరకడం అలవాటే అయినప్పటికీ.. ఈసారి కాస్త గట్టిగా కొరకడంతో స్రవంతికి బాగా కోపమొచ్చింది. దీంతో ఇకలాభం లేదనుకొని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.