బాబీని పట్టుకుంటే 25 వేలు , పోలీస్ వేట

    0
    1525

    సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం , తమ యు ట్యూబ్ ఛానల్స్ రేటింగ్ ల కోసం రకరకాల విన్యాసాలు చేసి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు చాలామందే ఉన్నారు.. వారిలో ఇదిగో బాబీ కటారియా ఒకడు.. కండలు పెంచాడేగానీ , బుర్ర మొద్దుబారిపోయింది. అందుకే నాటు రకం పనులు చేసి ఇప్పుడు పోలీసు వేటతో పరారీలో ఉన్నాడు. విమానంలో సిగరెట్‌ తాగుతూ, నడి రోడ్డుపై , టేబుల్ వేసుకొని చికెన్ మంచింగ్ తో , మద్యం సేవిస్తూ ఇటీవల వైరల్‌గా మారిన ప్రముఖ యూట్యూబర్‌ బాబీ కటారియా అరెస్ట్‌కు పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

     

    డెహ్రాడూన్‌లో రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా బాబీ కటారియాను అరెస్ట్‌ చేసేందుకు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబర్‌ ఆచూకీ చెప్పిన వారికి రూ.25,000 రివార్డ్‌ అందిస్తామని ప్రకటించారు. ఇలాంటి అసభ్యకరమైన పనులు యితడు చాలానే చేసాడు. నడిరోడ్డులో తీరిగ్గా టేబుల్ వేసుకొని మందు కొడుతూ వీడియో తీసుకొని , తన యూట్యూబ్ లో పెట్టుకున్నాడు. దీంతో పోలీసు ఈ కండల వీరుడు కోసం గాలిస్తున్నారు.

     

    నిందితుడిపై నాన్‌ బెయిలెబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. కటారియాను అరెస్ట్‌ చేసేందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు ఉత్తరాఖండ్‌ పోలీసులు. కానీ, అతడు పారిపోయాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు రూ.25,000 రివార్డ్‌ ప్రకటించటం జరిగింది.’అని తెలిపారు డెహ్రాడూన్‌ ఎస్‌ఎస్‌పీ దిలీప్‌ సింగ్‌ కున్వార్‌. ముస్సోరీ కిమాడి మార్గ్‌లో రోడ్డ మధ్యలో టెబుల్‌ వేసుకుని మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించాడని తెలిపారు. అలాగే మద్యం మత్తులో బైక్‌ ప్రమాదకరంగా నడిపాడన్నారు. దీంతో బాబీ కటారియాపై 342,336,290,510, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు దిలీప్‌ సింగ్‌.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.