త్వరలో ఫాస్టాగ్ బదులు నంబర్ ప్లేట్ రీడర్స్..

  0
  981

  త్వరలో జాతీయరహదారులపై టోల్ ప్లాజా లు కనుమరుగుకానున్నాయి. టోల్ ఫీజు కట్టేందుకు , లేదా ఫాస్టాగ్ రీడింగ్ కోసం వాహనం స్లో చేయాల్సిన పనిలేదు.. రయ్ ..మంటూ దూసుకుపోవచ్చు.. మరి ఇలా పోతుంటే టోల్ ఫీజు ఎలా కట్టాలి అని అనుకుంటున్నారు కదా ..? మన వెహికిల్ పోతుంటే , అక్కడక్కడా పెట్టే , నంబర్ ప్లేట్ రీడర్స్ , ఆటోమాటిక్ గా స్కాన్ చేసి , బ్యాంకు అకౌంట్ కి లింక్ అయి డబ్బులు జమయిపోతాయి.. ఇప్పుడు 97 శాతం వాహనాలకు ఫాస్టాగ్ స్టికర్లు ఉన్నాయి. అయినా , టోల్ ప్లాజా ల దగ్గర రద్దీ తగ్గడంలేదు. దీంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానం తో ఈ పద్దతిని మార్పు చేస్తున్నారు.

   

  ఇప్పుడున్న టోల్ ప్లాజాల దగ్గర , ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్స్ ఉంటాయి. నంబర్ ప్లేట్ ని రీడ్ చేస్తాయి. ఇందుకోసం ఆటోమాటిక్ నంబర్ ప్లేట్ రీడర్స్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అయితే అన్ని నంబర్ ప్లేటులను ఈ కెమెరాలు రీడ్ చేయలేవు.. 2019 తరువాత వచ్చిన వాహనాలకున్న నంబర్ ప్లేట్లను మాత్రమే ఇవి రీడ్ చేయగలవు. పాత వాహనాలకున్న , నంబర్ ప్లేట్లను ఇందుకోసం మార్పు చేస్తారు.

   

  అయితే నంబర్ ప్లేట్లపై , ఇతరత్రా ఉండే అక్షరాలు , బొమ్మలు , లాంటివి ఉంటే ఇది పనిచేయదు. అందుకోసం చట్టపరంగా , కొన్ని మార్పులు చేయాల్సివుంది. దీనిపై ఇప్పుడు కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాదినాటికి , పైలెట్ ప్రాజెక్టుగా , దేశంలోని నాలుగు ప్రాంతాల్లో దీన్ని అమలుచేసి , లొసుగులుంటే సవరించి , తరువాత దేశమంతా అమలు చేస్తారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.