మహిళాపోలీసుకు ఇక నైట్ డ్యూటీ లేదు..

    0
    474

    మహిళా పోలీసుల విధి నిర్వహణపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామ సచివాలయ సిబ్బందికి.. పోలీస్ విధులు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.దీంతో వారికి పోలీస్ విధులు ఇవ్వబోమని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. మహిళా పోలీసుల విషయంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని.. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.

    స్త్రీ సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా.. మహిళా పోలీసులను పర్యవేక్షిస్తుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కాగా మహిళా పోలీసులకు నైట్ డ్యూటీలు వేస్తున్నారని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారని.. న్యాయవాది నర్రా శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం..మహిళా పోలీసులకు నైట్, పోలీస్‌ డ్యూటీలు ఎలా వేస్తారని ప్రశ్నించింది. ఇకపై ఆ డ్యూటీలు వెయ్యబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.