మాధవ్ వీడియో అమెరికా సంస్థ రిపోర్ట్ ఫోర్జరీ..

    0
    663

    ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై సీఐడీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ల్యాబ్ నుంచి మాధవ్ డి ఒరిజినల్ వీడియో అని రిపోర్ట్ వచ్చిందని టిడిపి చెప్పే మాటలు నిజంకాదని అన్నారు. ఈ విషయాన్నే అమెరికాలోని జిమ్ ఫోర్డ్ ల్యాబ్ కూడా చెప్పిందని తెలిపారు. అయినా ప్రయివేట్ ల్యాబ్స్ ఇచ్చే నివేదికలను తామెలా పరిగణిస్తామని ప్రశ్నించారు. టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్‌ నివేదికలో లో వాస్తవాలు లేవు అన్నారు. ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారని అన్నారు. ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నామని తెలిపారు. ఈ పనిచేసిన నిందితులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.

    వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదన్నారు. ఒరిజినల్ ఫుటేజ్ దొరికినప్పుడు మాత్రమే ముందుకు వెళ్లగలం అని స్పష్టం చేశారు. ఒక ఫోన్ నుంచి అది ప్లే అవుతుండగా మరొక ఫోన్లో దాన్ని రికార్డు చేశారని అన్నారు. అది ఒరిజినల్ ఎలా అవుతుందని నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిమ్ క్లిఫార్డ్ కు సీఐడి తరపున లేఖ రాశాము. ఆయన నుంచి జవాబు కూడా వచ్చింది.

    తానిచ్చిన రిపోర్ట్ అసలైంది కాదనీ ఈమెయిల్ ద్వారా తెలిపారు. రాజమౌళి సినిమా లో పులులు సింహాలు ను ఫోన్ ద్వారా తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే అది ఒరిజినల్ గానే చెబుతారు అన్నారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను ఫోరెన్సిక్‌కు పంపి..రిపోర్ట్ తీసుకున్నారు. ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్‌ను మార్చి ప్రచారం చేశారు. ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వివరణ తీసుకున్నాం అని తెలిపారు. వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదని అన్నారు..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.