అదిరిందయ్యో , పెద్దాయన బుల్లెట్ స్ట్రోక్..

  0
  735

  బుల్లెట్ తాత..వామ్మో వాయించేస్తున్నాడు..బుల్లెట్ బండి అంటే మనదేశంలో తెలియని వారుండరు.. అంతటి క్రేజ్ ఆ బులెట్ బండికి మాత్రమే సొంతం. రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీకి చెందిన బుల్లెట్ మోడల్ బైక్ మనదేశంలో చాలా సక్సెస్ అయింది. ముఖ్యంగా బుల్లెట్ బైక్ సౌండ్ అంటే యువత ఎంతగానో ఇష్టపడుతుంది. ఆ సౌండ్ కోసం ప్రత్యేకంగా దాని సైలెన్సర్ ను కూడా మార్చుకుంటూ ఉంటారు.

   

  ఇప్పుడైతే సెల్ఫ్ స్టార్ట్ బులెట్ మోడల్ వచ్చింది కానీ.. పాత రోజుల్లో అయితే బులెట్ బైక్ కు కేవలం కిక్ స్టార్ట్ మాత్రమే ఉండేది. అప్పట్లో దాని కిక్ స్టార్ట్ చేయడమంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బుల్లెట్ బైక్ ఓల్డ్ మోడల్ స్టార్ట్ చేయాలంటే.. ఇప్పటివాళ్లకు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే బుల్లెట్ స్టార్ట్ చేయడంలో తేడా వస్తే మన కాలుకు పుత్తూరు కట్లు కట్టాల్సిందే..

   

  అయితే అలాంటి బుల్లెట్ బైక్ ను ఓ తాత సునాయాసంగా స్టార్ట్ చేస్తున్నాడు. ఒక్కసారి కాదు.. స్టార్ట్ కాలేదని ఆ బుల్లెట్ కు పట్టిన తుప్పు వదిలేలా అల్లడిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాత స్టామినా చూసిన నెటిజన్లు.. ముక్కున వేలేసుకుంటున్నారు. తాత ఇప్పుడే ఇలా ఉంటే.. ఆ రోజుల్లో రెచ్చిపోయి ఉంటాడని కామెంట్లు పెడుతున్నారు.

   

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.