ఓపికలేదు.తిరగబడతా- దర్శి ఎమ్మెల్యే హెచ్చరిక.

    0
    770

    ప్రకాశం జిల్లా వైసిపిలో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రత్యక్షంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. దర్శి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం లో తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. ఎమ్మెల్యే గా ఉన్న నన్ను ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా అవమాన పరుస్తూనే ఉన్నారన్నారు. ఇప్పటి వరకు ఎన్ని చేసిన అడ్డంకులు సృష్టించినా సహిస్తునే వచ్చాను, ఇక నుండి సహించను అని స్పష్టం చేసారు. తాను ఎమ్మెల్యే అయినా తనకు తెలియకుండా కొందరు నాయకులు కార్యకర్తలతో మీటింగ్ లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

    ప్లెక్సీ లలో ఒక ఎమ్మెల్యేగా తనకు ఇవ్వవలసిన గౌరవం కూడా ఇవ్వకుండా ప్లెక్సీ లలో ఫోటోలు వేయకుండా ఆగౌరవ పరిచారన్నారు. ఎమ్మెల్యే అయిన మూడు సంవత్సరాల నుంచి ఒక్కరోజు సరిగ్గా నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. రెడ్డి సామాజిక వర్గం తన వెంటే ఉందని అన్నారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా రాజకీయం చేస్తున్నారన్నారు. ఇక సహించే ఓపికలేదని , ఈరోజు నుంచి దేనికైనా ఊరుకునేది లేదని ..దేనికైనా సిద్థం, ఎంత దూరమైనా వెళ్తానని హెచ్చరించారు..

     

    వైసీపీ అదికారంలోకి వచ్చిన నాటినుండి దర్శిలకో బూచెపల్లి , మద్దిశెట్టి వర్గాల మద్య నెలకొన్న విభేదాలు పార్టీని గందరగోళంలో పడేశాయి. ఇటీవల చీమకుర్తి లో సిఎం జగన్ తో సభను దర్శి మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివ ప్రసాద్ రెడ్డి నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గైర్హాజరు అయ్యారు . ఎమ్మెల్యే కు సంభందం లేకుండా నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, మండల నేతలతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన తల్లి జెడ్పీ చైర్మన్ వెంకా యమ్మ. సమావేశాలు నిర్వహించడంతో పరిస్థితి చేజారింది..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.