భారతదేశ ఆటోమొబైల్ చరిత్రలో మారుతీ కారు ప్రస్థానం సంచలనమైనది. మొట్టమొదటి మారుతి 800 కారు ఇప్పటికీ ఆ కంపెనీలో తళతళ మెరిసిపోతుంటుంది. మొట్టమొదటి కారుకీ ఓ చరిత్ర ఉంది. 1983లో మారుతి కారు మార్కెటింగ్ మొదలైంది. ఇప్పటివరకు 40 లక్షలకు పైగా మారుతి 800 కార్లు అమ్ముడు పోయాయి. వాటిలో సగం కారులు ఇంకా రోడ్లపై పరుగులు తీస్తున్నాయంటే.. మారుతి 800 కారుకున్న కెపాసిటీలో ఏంటో అర్ధం చేసుకోవచ్చు. భారతీయ రోడ్లకు ఇంతకంటే మంచి కారు లేదన్నది సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు చెప్పే మాట.
పేద, మద్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ కారు మొట్టమొదటి ధర 47,500 రూపాయలు. హర్యానాలోని ఫ్యాక్టరీ నుంచి ఈ కారు బయటకి వచ్చింది.ఢిల్లీకి చెందిన హర్పాల్ సింగ్ అనే వ్యక్తి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా తొలి మారుతి 800 కారు తాళాలను తీసుకున్నారు. 2010లో ఆయన చనిపోయే వరకు ఈ తొలి మారుతి కారు ఆయన వద్దనే ఉంది. ఆ తర్వాత కారుకు మరమ్మత్తులు రావడంతో.. అతని కుటుంబం ఆ కారుని వాడకుండా బాగు చేయించకుండా వీధిలో పెట్టేసింది. ఈ కారు ఫోటోలో ఇంటర్నెట్ లో రావడంతో.. మారుతి కంపెనీ ఆ కారును కొనుగోలు చేసి దాన్ని మళ్ళీ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ తో కొత్తదానిలా తయారు చేసి ఫ్యాక్టరీలోనే ఉంచేసింది.
15 ఏళ్ళకు మించిన కార్లు ఢిల్లీలో వాడకంలో లేని కారణంగా, ఈ కారుని కంపెనీ హెడ్ క్వార్టర్ లోనే ఉంచేశారు. 2010లో మారుతి 800 ఉత్పత్తిని నిలిపివేసి ఆల్టో పేరుతో మార్కెట్ లోకి వచ్చినా.. ఆల్టో కూడా 2014లో నిలిపివేశారు. మళ్ళీ ఇంకొన్ని మార్పులతో ఆల్టో కారు మార్కెట్లోకి వచ్చింది. ఆల్టో ఒక్కటే కాదు.. ఎన్నో మోడల్స్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఎన్ని కార్లు విపణిలోకి వచ్చినా.. ఫ్లాట్ ఫామ్ వేసింది మాత్రం మారుతి 800 అని ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. దట్ ఈజ్ మారుతి 800.
ఇవి కూడా చదవండి..