అనంత్ అంబానీ దుబాయ్ ఇల్లు 640 కోట్లు.

  0
  111

  అంబానీల హ్యాండ్ బ్యాగుల ద‌గ్గ‌ర నుంచి ఇంటి వ‌ర‌కు ఏ వార్త అయినా విశేషంగా ఉంటుంది. దేని విలువైనా కోట్ల‌లో ఉంటుంది. తాజాగా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ దుబాయ్ లో కొన్న ఇల్లు వార్త‌ల్లోకెక్కింది. ఈ ఇంటి విలువ 640 కోట్లు. దుబాయ్ లోని ఫామ్ జుమేరా బీచ్ ఒడ్డున ఆయ‌న ఈ భ‌వంతిని కొన్నాడు.

  అప్పుడ‌ప్పుడు దుబాయ్ కి వెళ్ళిన‌ప్పుడు ఉండేందుకు గెస్ట్ హౌస్ గా దీన్ని వాడుకుంటారు. ఈ భ‌వ‌నంలో ప‌ది బెడ్ రూమ్ లు ఉంటాయి. ఇండోర్, అవుట్ డోర్ లో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఓ స్పా కూడా ఉంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, బ్రిట‌న్ ఫుడ్ బాల్ ప్లేయ‌ర్ డేవిడ్ బెక‌మ్ ఇళ్ళ ప‌క్క‌నే అనంత్ అంబానీ ఇల్లు కూడా ఉంద‌ని చెబుతున్నారు.

  మ‌న దేశంలోని కుబేరుల‌కు విదేశాల్లో ఇల్లు కొనాల‌న్న తాప‌త్ర‌యం ఇటీవ‌ల ఎక్కువైంది. ముఖ్యంగా దుబాయ్ లో ఆ ప్ర‌భుత్వం గోల్డెన్ వీసా ఇస్తుండ‌డంతో.. దీంతో భార‌తీయులు ఎక్కువ‌గా అక్క‌డ ఆస్తులు కొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.