విశాఖ స్టీల్ ప్లాంట్- కేంద్రం క్లారిటీ..

    0
    247

    విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేటీకరణ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్రమోదీ సమర్థించుకోగా.. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంపై వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కుండబద్ధలు కొట్టారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.

    నూటికి నూరుశాతం ప్రైవేటుకే..

    విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌ సభలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదని.. వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్టు ఆమె తేల్చిచెప్పారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

    https://twitter.com/nsitharamanoffc/status/1368892010619314184?s=20

    విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటన కీలకంగా మారింది. ఇటీవలే రాష్ట్ర బంద్ కూడా జరిగింది. ఈ దశలో ప్రైవేటీకరణ ఆగేది లేదని, అది కూడా నూటికి నూరుశాతం ప్రైవేటుపరం చేస్తామని క్లారీటి ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..