వెహికల్స్ లైఫ్ ట్యాక్స్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాహనాలపై జీవిత కాలపు పన్నును పన్నులన్నింటితో కలిపిన ఎక్స్ షోరూం ధర ఆధారంగా విధించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నికర ఇన్వాయిస్ ధర ఆధారంగా మాత్రమే పన్ను విధించాలని తేల్చిచెప్పింది.
వాహన ధర ఆధారంగా మాత్రమే లైఫ్ ట్యాక్స్ ను విధించాలని ఏపీ మోటారు వాహనాల పన్నుల చట్టంలోని ఆరో షెడ్యూల్ స్పష్టం చేస్తోందని పేర్కొంది. కారు కొనుగోలు వ్యవహారంలో నెట్ ఇన్వాయిస్ ధర ప్రకారం కాకుండా.. ఎక్స్ షోరూం ధర ఆధారంగా జీవిత కాలపు పన్ను విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం పైవిధంగా తీర్పు వెలువరించింది.
వాహన కొనుగోలు సమయంలో జీఎస్టీ 14 శాతం, ఎస్.జీఎస్టీ 14 శాతం కింద లైఫ్ ట్యాక్స్ వసూలు చేయడం చట్టంలో ఉందన్న ఏపీ సర్కార్ వాదనను తోసిపుచ్చింది. తాజాగా హైకర్టు తీర్పుతో వాహనదారులకు ఊరట లభించినట్లయింది.
ఇవి కూడా చదవండి..