నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో కాస్త ఆలస్యంగా స్పందించినా.. సంచలన విషయాలు బయటపెడుతున్నారు చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున. మొదట సమంతే విడాకులు అడిగిందని ఆయన అసలు విషయాన్ని తాజాగా చెప్పారు. విడాకులకు కారణం అక్కినేని కుటుంబం అనుకోవడం పొరపాటని, విడాకులు అడిగింది సమంతేనని అన్నారు నాగార్జున. తమ కుటుంబం విడాకులకు కారణం అని వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. తనపై అసత్య వార్తలు రాసినా పట్టించుకోను కానీ తన ఫ్యామిలీ గురించి నెగెటివ్‌గా రాయడంతో బాధ కలిగిందని అన్నారు నాగార్జున.
నాగ చైతన్య నుంచి సమంతే మొదటగా విడాకులు కోరిందని చెప్పారు నాగార్జున. విడాకుల ప్రయత్నాలను సమంతే మొదలు పెట్టిందని అన్నారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించి చైతన్య విడాకులకు అంగీకరించాడని తెలిపారు. నిజానికి చైతన్య, సమంత ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, నాలుగేళ్ల వివాహబంధంలో విడిపోయేటంత పెద్ద సమస్యేంటో తనకు ఇప్పటికీ తెలియదని పేర్కొన్నాడు.
2021 నూతన సంవత్సర వేడుకలను చైతన్య, సమంత కలిసే జరుపుకున్న విషయాన్ని నాగార్జున గుర్తు చేశారు. ఆ తర్వాతే వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని తెలిపాడు. కానీ ఈ విడాకుల విషయంలో తన గురించి, కుటుంబ పరువు, మర్యాదలు ఏమవుతాయోనని ఆందోళన చెందాడని నాగార్జున చెప్పారు. కుటుంబ పరువు మర్యాదలు పోతాయని తామింతవరకూ బయటపడలేదని అన్నారు. విడాకుల వ్యవహారం పూర్తై నెలలు గడుస్తున్న తర్వాత ఇప్పుడిప్పుడే అక్కినేని కుటుంబం అసలు విషయాలు బయటపెడుతోంది.