ఇండియన్ బిజినెస్ టైకూన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి సెక్యూరిటీ పెరిగింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆయన జడ్ కేటగిరి సెక్యూరిటీలో ఉన్నారు. తాజాగా ఆయనకు జడ్ ప్లస్ కేటగిరిని పెంచారు. ఇటీవల ముఖేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్ధాలతో ఉన్న వాహనాన్ని గుర్తించిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో అంబానీ భద్రతపై విస్తృతంగా చర్చించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అంబానీ భద్రత విషయంలో నిఘా వ్యవస్థల నివేదికను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. జడ్ ప్లస్ కేటగిరీలో మొత్తం 55 మందితో సెక్యూరిటీ ఉంటుంది. 10 మందికి పైగా ఎన్ఎస్‌జీ కమెండోలు ఉంటారు.
హయ్యస్ట్ సెక్యూరిటీలో ఎక్స్, వై, జడ్, జడ్ ప్లస్, ఎస్పీజీ కేటగిరీలు ఉంటాయి. సెకండ్ హయ్యస్ట్ లెవల్ సెక్యూరిటీ జడ్ ప్లస్ కేటగిరీ. ఇప్పుడీ కోవలో అంబానీ చేరిపోయారు. ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, కేంద్రంలో కీలకంగా వ్యవహరించే నేతలు, ప్రముఖ సినీ సెలబ్రిటీలు, తీవ్రవాద ముప్పు ఉన్న వారికి ఈ భద్రతను ఏర్పాటు చేస్తారు.
ఇవి కూడా చదవండి..