ప్రపంచంలో అతి పెద్ద పువ్వు కనపడింది..

    0
    297

    పువ్వులు ఎంత సైజులో ఉంటాయి. అర అంగుళం నుంచి మ‌హా అయితే అర‌చేయి అంత ఉంటాయి. కానీ ఈ పుష్పం మాత్రం అరుదైన‌ది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది. ఈ పుష్పం మూడు అడుగులు ఉంటుందంటే న‌మ్ముతారా ? న‌మ్మ‌క‌పోయినా.. దీన్ని చూస్తే మాత్రం న‌మ్మి తీరాల్సిందే. ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దిగా ఈ పుష్పం రికార్డుల‌కెక్కింది. ఈ పువ్వు పేరు రెఫ్లేసియా. మూడు అడుగుల వ్యాసంతో విచ్చుకుంటుంది. చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. విచ్చుకున్న త‌ర్వాత ఈ పువ్వు అందం మ‌రింత పెరిగిన‌ట్లు అనిపిస్తుంది.

    దీని జీవిత కాలం ఒక్క‌రోజు మాత్ర‌మే. మ‌రుస‌టి రోజు నేల రాలిపోతుంది. ఇది నేల రాలిన‌ప్పుడు దీని నుంచే వ‌చ్చే దుర్వాస‌న భ‌రించ‌డం ఎవ‌రిత‌రం కాదు. శ‌వం కుళ్ళిన త‌ర్వాత వ‌చ్చే దుర్వాస‌న ఎలా ఉంటుందో.. నేల‌రాలిన రెఫ్లేసియా పువ్వు నుంచి వ‌చ్చే వాస‌న కూడా అలాగే ఉంటుంది. ఇలా నేల‌రాసిన పువ్వుని కీట‌కాలు, పురుగులు తింటాయి. ఈ అరుదైన పుష్పాన్ని ఇండోనేషియా అడ‌వుల్లో ఓ వ్య‌క్తి కంట ప‌డింది. దీన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయింది.

     

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.