తల్లీ కొడుకులకు ఒకేసారి ఉద్యోగం..

    0
    1097

    కేరళలో ఒక అరుదైన సంఘటన జరిగింది. కుమారుడితో పాటు ఓ తల్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టినీ ఒక్కసారిగా ఆకర్షించింది. సాధించాలనే తపన ఉంటే ఏ వయసులోనైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది. ఉద్యోగ సాధనలో కుమారుడితో పాటు సాగిన తల్లి ప్రస్థానం ప్రేరణాత్మకం.

    కేరళలో, మలప్పురానికి చెందిన 42 ఏళ్ల తల్లి మరియు ఆమె 24 ఏళ్ల కుమారుడు కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పిఎస్‌సి) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కేరళ మలప్పురానికి చెందిన 42 సంవత్సరాల బిందు, ఆమె కుమారుడు 24 సంవత్సరాల వివేక్ ఇద్దరు కలిసి ఒకేసారి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రాశారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న బిందు కల ఇన్నేళ్ల తర్వాత కొడుకుతో పాటు నిజమైంది.

    బిందు, వివేక్ ఇద్దరూ కలిసి కోచింగ్ క్లాసులకు హాజరయ్యారు. ఇంటి దగ్గర కూడా ఇద్దరూ కలిసి కంబైన్డ్ స్టడీ చేశారు. కోచింగ్ సెంటర్ లోని అధ్యాపకులు కూడా ఎంతో పట్టుదలతో చదువుతున్న తల్లీ, కొడుకులను ప్రోత్సహించారు. ఇక ఫైనల్ గా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో తల్లీ కొడుకులిద్దరూ ఉత్తీర్ణత సాధించారు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.