భార్య బిడ్డలను పోషించేందుకు , భర్త విదేశాల్లో ఉండి సంపాదిస్తుంటే , భార్య మాత్రం తన కొడుకు వయసున్న వాడితో అక్రమసంబంధం పెట్టుకొని , వాడిని లేపుకు పోయింది. తల్లి , తన ఫేస్ బుక్ ప్రియుడితో డబ్బు , నగలతో పరారయిందని కొడుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలో అయ్యప్పన్ , లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒకరికి 22 ఏళ్ళు , మరొకడికి 19 ఏళ్ళు, భర్త అయ్యప్పన్ సింగపూరు లో ఉద్యోగం చేస్తున్నాడు.
భార్య లలితకు ఫేస్ బుక్ లో రెండేళ్ల క్రితం 21 ఏళ్ళ యువకుడితో స్నేహం కుదిరింది. అది ముదిరి అక్రమసంబంధానికి దారితీసింది. ఈ విషయం పసిగట్టిన కొడుకులు , తల్లికి బుడ్డి మార్చుకోమని చెప్పిచూసారు. అయినా ఆమె మారలేదు. చివరకు , ఇంట్లో డబ్బు , నగలతో ఆ కుర్రాడితో లేచి పోయింది. కొడుకులిద్దరూ , తమ తల్లి , ప్రియుడితో లేచిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు..
ఇవి కూడా చదవండి..