నీటిలో ఉండే మొసలి ఒక్కసారి బయటకి వస్తే ఏం అనిపిస్తుంది ? గుండె అదిరపడదూ. అదే పది మొసళ్ళు వస్తే ఎలా ఉంటుంది ? వందల సంఖ్యలో మొసళ్ళు వస్తే.. ఇంకెలా ఉంటుంది ? జస్ట్ ఇమాజిన్. ప్రాణం గాల్లో కలిసిపోవా ? అలాంటి ఒళ్ళు గగుర్బొడిచే దృశ్యమే ఇది. బ్రెజిల్ లో చోటుచేసుకుంది. బ్రెజిల్ సముద్ర తీరంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మొసళ్ళు బయటకొచ్చాయి. ఒకటి కాదు రెండు కాందు.. వందల సంఖ్యలో సముద్రపు మొసళ్ళు తీరానికి వచ్చాయి. దీంతో తీర ప్రాంతంలో ఉన్న సందర్శకులు ఒక్కసారిగా హడలిపోయారు.
ఎక్కడివారు అక్కడ నుంచి పరుగులు తీశారు. మొసళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దౌడు తీశారు. అలా కొంతదూరం వెళ్ళిన తర్వాత.. తీరం ఒడ్డున సేద తీరుతున్న మొసళ్ళను తమ ఫోన్లలో, కెమెరాల్లో చిత్రీకరించారు. అయితే అది బీచ్ కాదని, బీచ్ కి ఆనుకుని ఉండే రివర్ బెడ్ అని కొందరు అంటున్నారు. సత్ బాత్ కోసం అప్పుడప్పుడు మొసళ్ళు వస్తుంటాయని చెబుతున్నారు. అయితే ఒకేసారి వందల సంఖ్యలో రావడం మాత్రం అరుదని అంటున్నారు. హడలెత్తించిన మొసళ్ళు ఒక్కసారిగా ఇలా రావడంపై పరిశోధనలు చేస్తున్నారు.
In Brazil, an invasion of crocodiles that have flooded one of the beaches with several hundred, even thousands, and the local population is panicking pic.twitter.com/3xnkqHdoyl
— Ken Rutkowski (@kenradio) September 15, 2022
ఇవి కూడా చదవండి..