ఆకలి తీర్చిన యజమాని కోసం ఓ కోతి..

    0
    162

    కడుపున పుట్టిన బిడ్డలు, తోడ బుట్టిన వాళ్లు కూడా నేటి రోజుల్లో పరాయివారై పోతున్నారు. రోజురోజుకీ మారిపోతున్న జీవన విధానంలో బంధాలను ఎప్పుడో గాలి కొదిలేశారు. డబ్బే ముఖ్య మంటూ ఒంటరిగా మిగిలిపోతున్నారు. కష్టసుఖాల్లో కూడా ఎవరూ తోడుగా నిలవడం లేదు. అయితే ఇలాంటి రోజుల్లో కూడా ఓ వానరం తనకు ముద్ద పెట్టిన యజమానిని గుర్తుంచుకుంది. అన్నం పెట్టిన యజమాని చనిపోవడంతో కన్నీరు మున్నీరైంది.

    కొలంబోలో ఈ హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోవడంతో.. ఆ మృతదేహం వద్ద కూర్చొని ఏడ్చింది. యజమానికి ముద్దులు పెడుతూ మౌనంగా కన్నీరు పెట్టుకుంది. ఈ హృదయ విదారకమైన దృశ్యాలు స్థానికుల హృదయాలను కలచివేశాయి. శ్రీలంక లోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌గా మారింది.

     

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.