ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ ప్రాంతానికి చెందిన కృష్ణ సోషల్ మీడియాలో గతంలోనే వైరల్ అయ్యాడు. ముగ్గురు భార్యలున్న ఇతగాడు భార్యలు బిడ్డలతో ఒకే ఇంటిలో కాపురం ఉంటున్నాడు. ఇక ఆ ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. వీరి పేర్లు శోభా, రీనా, పింకీ. ముగ్గురినీ ఒకే పెళ్లి మండపంలో ఒకే రోజు పెళ్లి చేసుకున్నాడు కృష్ణ. ఈ ముగ్గురు అక్క చెల్లెల్లు ఏరికోరి మరీ ఇతగాడిని పెళ్లి చేసుకున్నారు. ఈ ముగ్గురికీ చెరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వీళ్లంతా కంసీ రామ్ కాలనీలో కృష్ణతో కలిసి అన్యోన్యంగా జీవిస్తున్నారు. కర్వా చౌత్ సందర్భంగా భర్త సుఖ సంతోషాలు కోరుతూ ముగ్గురు భార్యలు ఉపవాసం ఉన్నారు. సాయంత్రం చంద్రుడికి పూజలు చేశారు. ఆపై చంద్రుడు వచ్చాక ఓ జల్లెడను తెరగా చేసుకుని భర్తను చూశారు. హారతులు ఇచ్చి… అనంతరం భర్త కళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియోతో మరోసారి కృష్ణ వార్తల్లో నిలిచాడు. ఇన్నేళ్లు గడిచినా ఏ ఒక్కరికి మనస్పర్థలు రాకపోవడం చెప్పుకోదగ్గ విషయం.
चित्रकूट के रहने वाले कृष्णा का करवा चौथ सोशल मीडिया पर चर्चा का विषय बना हुआ है।
– इस बार भी अपनी तीनों पत्नियों के साथ करवा चौथ मनाया।
– कृष्णा की तीनों पत्नियां शोभा, रीना और पिंकी सगी बहनें हैं। pic.twitter.com/1DTTlHPYfX— Shubhankar Mishra (@shubhankrmishra) October 15, 2022
ఇవి కూడా చదవండి..