హత్యకేసులో ఆధారాలను కోతి తీసుకెళ్ళిపోయింది ..

    0
    325

    ఒక హత్య కేసులో ఆధారాలను కోతి తీసుకెళ్ళి పోయిందని సాక్షాత్తు పోలీసులే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . ఇది మామూలుగా ఎవరికైనా చెబితే కట్టుకథ అని కొట్టి పారేస్తారు, కానీ ఇది కథ కాదు పోలీసు కథ . ఇప్పుడు పోలీసులు కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది . ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి . రాజస్థాన్లో 2016లో చాంద్ బాజీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక హత్య జరిగింది. రాహుల్ కేడెరా , మోహన్ లాల్ కేడెరా అని ఇద్దరూ శశికాంత్ శర్మ అనే వ్యక్తి వ్యక్తిని చంపేశారు. వీరిద్దరిని అరెస్టు చేయాలని అప్పట్లో పట్టణంలో ధర్నాలు కూడా జరిగాయి .

    ఎట్టకేలకు పోలీసులు హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత రాహుల్ , మోహన్ లాల్ లను అరెస్టు చేశారు . ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత ఈ హత్య కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులు కోర్టుకు వచ్చారు. హత్యకు ఉపయోగించిన కత్తి , ఇతర ఆధారాలు అన్నింటినీ తాము ఒక సంచిలో పెట్టి కోర్టుకు తీసుకువచ్చామని ,చెట్టు కింద ఆ సంచి పెట్టి , కోర్టులో తమను పిలుస్తారని వేచి చూస్తున్నామని , ఈలోగా ఒక కోతి వచ్చి ఆ సంచీ తీసుకెళ్లి పోయిందని చెప్పారు.

    ఈ మేరకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . అందువల్ల తమ వద్ద ఆధారాలు ఏమీ లేవని , కోతి తీసుకెళ్లిన సంచిలో పదిహేను ఆధారాలను కోర్టుకు సమర్పించాల్సి ఉందని , ఇప్పుడు వాటిని కోతి తీసుకెళ్లడంతో వాటి కోసం అన్వేషిస్తున్న మని చెప్పారు . న్యాయమూర్తి వీటన్నింటిని రాతపూర్వకంగా కోర్టు ఇవ్వగలరా అని అడిగితే పోలీసులు భయం లేకుండా హత్య కేసులో ఆధారాలను కోర్టు లో చెట్టు కింద పెట్టుకుని వెయిట్ చేస్తుంటే కోతి తీసుకెల్లిందని ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ..

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.