కరోనా ప్రభావం అన్ని రంగాలతోపాటు, వివాహాలపై కూడా బాగానే పడింది. కరోనా వల్ల చాలా చోట్ల పెళ్లిళ్లు ఆగిపోయాయి. బంధువుల రాకపోకలు లేవు కాబట్టి.. కొంతమంది పరిమిత సంఖ్యలోనే కుటుంబ సభ్యుల మధ్య ఆ తంతు ముగించినా.. ఆర్భాటంగా చేసుకోవాలనుకున్నవారు మాత్రం టైమ్ కోసం వేచి చూశారు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా భయం ఇప్పుడిప్పుడే పోయింది. అందువల్ల ఈ ఏడాది పెళ్లిళ్లు జోరందుకునే అవకాశం ఉంది. ఒక్క అమెరికాలోనే 25 లక్షల పెళ్లిళ్లు అవుతాయని ఓ మార్కెట్ సర్వే సంస్థ తెలిపింది.
1984 తర్వాత అమెరికాలో ఇంత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగబోతన్నాయి. ప్రపంచం మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 2023 కల్లా పరిస్థితులు చక్కబడతాయని అంటున్నారు. 2022 మధ్యలో నుంచి పెళ్లిళ్లు భారీగా జరుగుతాయని అంటున్నారు. కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. ప్రార్థనాలయాలు అన్నీ మూసేశారు. పెళ్లి చూపులకు కూడా అటు వాళ్లు ఇటు, ఇటవాళ్లు అటు వెళ్లలేని పరిస్థితి. దీంతో వివాహాల వ్యవహారం నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతుండటంతో గతంలో వాయిదా పడ్డ అన్ని కార్యక్రమాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. దీంతో పెళ్లిళ్ల సంఖ్య భారీగా పెరిగింది.
మరోవైపు మళ్లీ పెళ్లికి టైమ్ రాదేమోనని కొందరిలో భయం ఉంది. కరోనా మళ్లీ విరుచుకుపడినా, కొత్త వేరియంట్ వచ్చినా, కొత్త వైరస్ వచ్చినా కూడా ప్రమాదమే. అందుకే ఇప్పుడు అందరూ ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. మళ్లీ కరోనా విజృంభించక ముందే అన్ని కార్యక్రమాలు ముగించాలని కొంతమంది అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు పెళ్లి మహూర్తాలు కుదురుతున్నాయి.
ఇక పెళ్లిళ్లతో మొదలయ్యే బిజినెస్ కూడా ఇటీవల బాగా తగ్గిపోయింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు అనుకూలించడంతో అందరూ పెళ్లిళ్ల బిజినెస్ పై పడ్డారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు. అందుకే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ లో భారీ సంఖ్యలో మహూర్తాలు కుదిరాయి.