బిక్షాటన నుంచి ,కోట్లకు పడగలెత్తి..

  0
  1877

  చిన్న వయసులో తండ్రితో కలిసి బిక్షాటన.. ఆ తరువాతే తానే భిక్షాటనకు.. తర్వాత తోపుడు బండి నెట్టేపని , ఆ తరువాత ఇంట్లో పనిమనిషిగా , ఆ తరువాత సెక్యూరిటీ గార్డుగా , అక్కడినుంచి డ్రైవర్ గా.. ఇలా అంచెలుఅంచెలుగా ఎదిగిన వ్యక్తి రేణుక ఆరాధ్య.. పని చేసుకుంటూనే పదో తరగతి వరకు చదివి , ఆ తరువాత కూలి పనులకు పోయాడు.. ఈ రోజు పెద్ద ట్రావెల్ ఏజెన్సీకి అధిపతి.. 140 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే ప్రవాస్ ట్రావెల్స్ ఓనర్.. బెంగుళూరులో ప్రముఖ వ్యక్తి.. గతాన్ని మరిచిపోని మనిషి.. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతను నిజంచేసి , విధిని ఎదిరించిన వ్యక్తి.. ఇప్పుడు వెయ్యి కార్లు , అందులో 250 కార్లు ఆయన స్వంతం.. ఇది కాక 40 స్కూల్ బస్సులు నడుపుతున్నాడు..

  ఆరాధ్య తండ్రి అనేకల్ తాలూకా , గోపసముద్రం అనే గ్రామంలో ఉన్న ముత్యాలమ్మ దేవాయలయంలో పూజారి.. గుడి మూసేసిన తరువాత భిక్షాటనకు వెళ్ళేవాడు.. బిక్షంలో వేసే బియ్యం, రాగులు , జొన్నల కోసం సంచి ఎత్తుకొని , ఆరాధ్య తండ్రితో పోయేవాడు. ఆరో తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నాడు. తరువాత తండ్రి వృద్ధుడైన కావేరిప్పన్ వద్ద పనిమనిషిగా చేర్చాడు. అక్కడ పనిచేస్తూనే , ఆయన తినగా మిగిలిన అన్నం తినేవాడు.. రెండు రోజులకొకసారి మాత్రమే అన్నం మిగిలేది. ఇలా ఆరు నెలలు జరిగినతరువాత , ఈ విషయం తెలిసి తండ్రి అతడిని బెంగుళూరులోని మహంతీర మఠంలో చేర్చాడు.

  అక్కడ ఉదయం 8, రాత్రి 8 గంటలకే భోజనం పెడతారు. ఈ లోగా ఆకలైతే బెంగుళూరు కెంపెగౌడ రోడ్డులోని ఎస్ బి ఎమ్ సర్కిల్ వద్ద , మార్కెట్ లో పనికిరాని అరటి పళ్ళు పారేసేవారట.. వాటిని తిని ఆకలి తీర్చుకునే వాడినని ఆరాధ్య నవ్వుతూ చెప్పినా , ఆ మాటలు వింటే కన్నీరు వస్తుంది.. ఆయన ఇన్ని కన్నీటి కష్టాలను భరించాడు కాబట్టే , ఈ రోజు ఆ కష్టాలను మరిచిపోకుండా , జీవిస్తున్నాడు..

  పెళ్ళైన తరువాత జీవనం కోసం తాను కొబ్బరికాయలు కోసేందుకు , కొబ్బరి చెట్లు ఎక్కేవాడినని చెప్పాడు. ఒక్క చెట్టుకు 15 రూపాయలు తీసుకునేవాడినని అన్నాడు. రోజుకు 20 చెట్లు ఎక్కేవాడినని అన్నాడు. తన భార్య పుష్ప కూడా , నెలకు 275 రూపాయలు జీతానికి , రెడీమేడ్ ఫ్యాక్టరీలో ప్యాకర్ గా పనిచేసేదన్నారు. తన డ్రైవింగ్ చరిత్రలో రెండేళ్ల కాలం , శవాలు తీసుకెళ్లే మెటాడర్ వ్యాన్ డ్రైవర్ గ ఉన్నానని చెప్పాడు.. ఒక మనిషి ఉన్నతి వెనుక ఎంత కష్టం , కన్నీరు , వ్యధ ఉంటుందో ఆరాధ్య జీవితమే నిదర్శనం..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.