పక్కింటోళ్లని కూర వండేశాడు…

  0
  2133

  ఇరుగు పొరుగుతో ఎవరైనా చనువుగా ఉంటారు, ఏవైనా ఇచ్చి పుచ్చుకుంటారు. కలసి సినిమాలకి, షికార్లకి, షాపింగ్ లకి వెళ్తారు. ఇంకా చనువెక్కువైతో గోడలు దూకేస్తారు. అయితే వీడు మాత్రం వీటన్నిటినీ మించిపోయాడు. ఏకంగా పక్కింటోళ్లను కూరొండేశాడు. రుచిగా ఉంటుందని గుండె, లివర్ బయటకు తీసి ఫ్రైచేసుకుని తినేశాడు.

  వివరాల్లోకి వెళ్తే..
  మనిషి మాంసం రుచి మరిగిన ఓ నీఛుడు చేసిన పని సంచలనం కలిగిస్తోంది. తన ఇంటి పక్కనే కాపురం ఉండే కుటుంబంలో ముగ్గురిని హత్య చేసి, ఒక మహిళ గుండెను కోసి, వండుకొని తిన్నాడు. ఈ నీఛుడి పేరు లారెన్స్ ఆండర్సన్. ఒక్లహాంలో జరిగిన ఘోరం ఇది. పోలీసు విచారణలో తన నేరాల్ని ఒప్పుకున్నాడు.

  ఇంటి పక్కనే ఉన్న 67ఏళ్ల వృద్ధుడుని, అతని నాలుగేళ్ల మనవడిని, తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఛాతీ భాగాన్ని చీల్చి, గుండె తీసుకుపోయి బంగాళాదుంపతో కలిపి వండుకున్నాడు. మళ్లీ వచ్చి, చిన్నపిల్ల గుండె, లివర్ తీసుకుని, రాత్రికి వంట చేసుకుని తిన్నాడు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి దయ్యం పట్టిందని, దాన్ని వదిలించేందుకే ఈ పని చేశానని పోలీసులకు చెప్పాడు. మనిషి గుండె వండుకుని తింటే, దయ్యం వదిలిపోతుందని చెప్పడంతో తను ఇలా చేశానని అన్నాడు. 2017లో పలు నేరాలపై 20ఏళ్లు శిక్ష అనుభవిస్తున్న ఈ నీఛుడు ఇటీవలే పెరోల్ పై వచ్చి మళ్లీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కోర్టు విచారణలో తనకు బెయిల్ వద్దని తను బయట ఉంటే ఇలాంటి నేరాలే చేస్తానని అందువల్ల తనను జైలుకే పంపించమని న్యాయమూర్తిని వేడుకున్నాడు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..