మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. స్కూళ్లు, హాస్టళ్లు మూసివేత…

    0
    410

    మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అమరావతి జిల్లాలో వీకెండ్ లాక్ డౌన్ తోపాటు, పుణెలాంటి నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించి కరోనా కట్టడికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది మహారాష్ట్ర సర్కారు. అయితే మహారాష్ట్రలో రోజు రోజుకీ కరోనా కేసుల విజృంభణ పెరిగిపోతోంది. వషిమ్‌ జిల్లాలోని ఓ స్కూల్ హాస్టల్ లో 190 మందికి వైరస్‌ సోకడం కలకలం సృష్టించింది. వైరస్‌ సోకిన వారిలో 186 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. దీంతో అధికారులు పాఠశాల పరిసరాల్ని కంటైన్‌మెంట్‌‌ జోన్‌గా ప్రకటించారు. కాగా, వసతి గృహానికి వచ్చిన విద్యార్థుల్లో.. ఇటీవల మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందిన అమరావతి, యావత్మల్‌ జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు.

    గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 8వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది మరణించారు. దేశంలో నమోదైన కేసుల్లో సగ భాగం మహారాష్ట్రలోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 60వేలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్త ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముంబయి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

    ఇవీ చదవండి:

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

    ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

    ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..