చర్చికి పోతే , ఇంట్లో సిలువ ఉంటే మతం మారినట్టేనా..?

    0
    456

    ఇంట్లోనో , హాస్పిటల్లోనో సిలువ పెట్టినంతమాత్రాన , చర్చికి పోయిందన్న కారణంతో దళితురాలు అన్న కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేయడం సమంజసం కాదని మద్రాస్ హైకోర్టు తీర్పుచెప్పింది. రామనాధపురానికి చెందిన ఒక మహిళా డాక్టర్ ,దళితురాలు. ఆమె క్రిస్టియన్ ను పెళ్లాడింది. చర్చికి పోయేది.. తన హాస్పిటల్లో గోడలకు సిలువ తగిలించింది. దీంతో కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారి , ఇవన్నీ పరిశీలించి , ఆమె దళితురాలు కాదని అబిప్రాయపడి , ఎస్సీ కల ధ్రువీకరణ పత్రం రద్దుచేశారు. దీనిపై ఆమె న్యాయస్థానాలను ఆశ్రయించింది. చర్చికి పోయినంత మాత్రాన , స్వంత మతవిశ్వాసాలను కాదని బావించకూడదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అధికారులు కూడా సంకుచితంగా కాకుండా , విశాల దృక్పధంతో ఆలోచించాలని చెప్పింది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..