ఫేస్ బుక్ నుంచి మరో అద్భుతం…

  0
  132

  మరో 9ఏళ్లలో ఓ అద్భుత ఆవిష్కరణకు ఫేస్ బుక్ శ్రీకారం చుట్టబోతోంది. మనం ఎంతదూరంలో ఉన్నా.. ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే కంటి అద్దాలను రూపొందించబోతోంది. దీన్ని టెలిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. 2030కల్లా దీన్ని అభివృద్ధి చేస్తామని అంటున్నారు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్.
  రాబోయేది విర్చువల్ రియాల్టీ యుగమేనంటున్న జుకెర్ బర్గ్.. ఆ రంగంలో బారీగా నిధుల్ని పెట్టుబడిగా పెడుతోంది.

  టెలిపోర్టింగ్ కోసం ఓ హెడ్ ఫోన్, దానికి సంబంధించిన టెక్నాలజీ ఉన్న కంటి అద్దాలు సరిపోతాయి. ఆ రెండిటితో అద్భుతం సాకారం అవుతుంది. ప్రస్తుతం మనం ఉపయోగించే సెల్ ఫోన్ కన్నా ఈ టెక్నాలజీ అత్యద్భుతంగా ఉంటుంది. ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడినట్టే ఉంటుంది. 2030కల్లా ఇది సాకారమవుతుంది.

  టెలిపోర్టింగ్ కోసం ఫేస్ బుక్ సంస్థ, ఒకొలస్ తో కలసి పనిచేయబోతోంది. స్మార్ట్ గ్లాసెస్ కోసం రేబాన్ కంపెనీతో, లక్సోటికా గ్రూప్ తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.

  ఉపయోగాలు ఏంటి..?
  టెలిపోర్టింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయని అంటున్నారు మార్క్ జుకెర్ బర్గ్. వివిధ ప్రాంతాల మధ్య అనవసర ప్రయాణాలు తగ్గిపోతాయి, రద్దీ పూర్తిగా తగ్గిపోతుంది. బంధువులతో, స్నేహితులతో మాట్లాడాలనుకున్నా, గ్రూప్ చాటింగ్స్ అవసరమయినా దీన్ని ఉపయోగించవచ్చు. ఎదురుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి.. ప్రయాణం, ప్రయాస అవసరం లేకుండానే అయినవారితో మాట్లాడొచ్చు. వారు ఎక్కడున్నారో గుర్తించ వచ్చు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. వాతావరణ కాలుష్యం నుంచి కూడా బయటపడొచ్చు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..