జగన్ స్టయిల్లో లోకేష్ పాదయాత్ర..ముహూర్తం ఎప్పుడు..?

  0
  109

  టిడిపి జాతీయప్రధానకార్యదర్శి లోకేష్, పాదయాత్రకు సమాయత్తం అవుతున్నారు.. ఇందుకు సంబందించిన కసరత్తు జరుగుతొందని చెబుతున్నారు. ఏడాదిపాటు పాదయాత్ర కొనసాగేవిధంగా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారట .. దీనికి సంబందించి లోకేష్ కు రాష్ట్రంలోని సమస్యలు , అన్నిజిల్లాల సామాజిక , రాజకీయ , భౌగోళిక పరిస్థితులపై అవగాహన చేసుకుంటున్నారని చెబుతున్నారు. జగన్ పాదయాత్ర తరహాలోనే లోకేష్ పాదయాత్ర ఉంటుందని చెబుతున్నారు. పాదయాత్రను రాష్టంలోని మూడు ప్రాంతాలు , రాయలసీమ , కోస్తా , ఉత్తరాంధ్ర జిల్లాలు కవర్ అయ్యేవిధంగా రూపొందిస్తున్నారట.

  మొదటగా పల్లెప్రాంతాలనే టచ్ చేసేవిధంగా పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది. మూడు ప్రాంతాలు , రాయలసీమ , కోస్తా , ఉత్తరాంధ్ర జిల్లాలు మూడింటిని ఒకేసారి కవర్ చేస్తారా లేక మూడు దఫాలుగా గ్యాప్ ఇచ్చి పాదయాత్ర చేస్తారా అన్నది ఆలోచనలో ఉందని చెబుతున్నారు. జగన్ లాగా , ఒకే దఫా రాష్ట్రం మొత్తం పాదయాత్ర ద్వారా చుట్టేయడమే మంచిదన్న అబిప్రాయంకూడా ఉంది.

  ఇదిలా ఉండగా , పాదయాత్రలో ఉపన్యాస కళలో కూడా , లోకేష్ శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. తన తరువాత లోకేష్ ని నాయకుడుగా తీర్చిదిద్ది , తన రాజకీయ వారసత్వాన్ని అప్పజెప్పాలన్నది చంద్రబాబు తాపత్రయం. అయితే మొదట్లోనే బాష, భావ వ్యక్తీకరణ విషయంలో లోకేష్ , సోషల్ మీడియాలో అపహాస్యానికి గురయ్యాడు. నాయకత్వానికి పనికిరాడేమోనన్న అభిప్రాయం కలిగించాడు. అయితే ఇటీవల కాలంలో , భాషలో , మెరుగు కనిపించింది. మాటల్లో పదును పెరిగింది. పరుషమైన పడాలనే వాడుతున్నాడు. అయితే గత కొంతకాలంగా అజ్ఞాతంలో , పాదయాత్ర పై , కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..