మెగా బ్రదర్స్ పనే ఇది.. తన సినిమా ట్రోల్స్పై మంచులో మంటలు..

  0
  413

  అనుకున్నట్టే అయింది.. మోహన్ బాబు , సన్ ఆఫ్ ఇండియా , సినిమా రిలీజ్ తరువాత సోషల్ మీడియాలో కామెడీ పోస్టింగ్స్ ఎక్కువయ్యాయి. తన సినిమా సన్ ఆఫ్ ఇండియా రిలీజ్ కి ముందు నుంచే ఇద్దరు హీరోలు ఒక పధకంప్రకారం తన మనుషులచేత నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారని మోహన్ బాబు నిన్న ఒక టివి ఇంటర్వ్యూలో చెప్పారు, రాజకీయాల్లో డిపాజిట్లు తెచ్చుకోలేనివాళ్ళు , సినిమాల్లో కంపు రాజకీయాలు చేస్తున్నారని అన్నాడు.

  చిరంజీవి , పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఆయన ఇలా అన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. సన్ ఆఫ్ ఇండియా సినిమా రిలీజ్ కి ముందే , ఆన్ లైన్ లో ఈ సినిమాకు ఇద్దరే టికెట్లు బుక్ చేసుకున్నారని వాళ్ళిద్దరూ , మంచు విష్ణు , మంచు లక్ష్మి అని ట్రోల్ చేశారు. ఇదే మోహన్ బాబు కి పుండుమీద కారం చల్లినట్టు అయింది. సినిమా రిలీజ్ తర్వాతకూడా సన్ ఆఫ్ ఇండియా సినిమాపై ట్రోల్స్ పెరిగాయి.

  చిరంజీవి , పవన్ కళ్యాణ్ మనుషులే , డబ్బులిచ్చి ఇలా చేయిస్తున్నారని మోహన్ బాబు , విష్ణు విమర్శిస్తున్నారు. దీంతో ఈ విషయంలో మోహన్ బాబు మళ్ళీ డైరెక్ట్ అటాక్ కె సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మా ఎన్నికలనుంచి రెండు వర్గాలుగా విడిపోయి , తిట్టుకుంటున్న సినీ పరిశ్రమలో సన్ ఆఫ్ ఇండియా సినిమా పై ట్రోల్స్ మళ్ళీ చిచ్చు పెట్టే అవకాశం ఉంది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..