లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర…

    0
    87

    భారత దేశంలో తొలిదశ లాక్ డౌన్ లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్లారా చూశాం. రెండోసారి అలాంటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ అంటేనే వెనకడుగేస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి చేయి దాటేలా కనిపిస్తోంది. గడచిన 24గంటల్లో 63,294 కేసులు నమోదు కాగా.. ఒక్క రోజులోనే 349 మంది మరణించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో అధికారులు, ఇతర నేతలంతా లాక్ డౌన్ తప్ప వేరే మార్గంలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అవైలబిలిటీ, బెడ్స్, ట్రీట్ మెంట్ ప్రొటోకాల్స్ పై చర్చించారు. దీనిపై ఆర్థిక శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏప్రిల్ 14 తర్వాత ఏ క్షణమైనా లాక్ డౌన్ పై ప్రకటన వెలవడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ముందుగానే వలస కూలీలు భయపడిపోయారు, సొంత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ