4 కోట్ల పాత టైర్లను కువైట్ ఇలా చేస్తోంది..

  0
  5870

  కారు టైరో… బైక్ టైరో… అరిగిపోతే మ‌నం ఏం చేస్తాం.. తీసి ఓ మూల‌న ప‌డేస్తాం. లేదంటో రోడ్డు మీద వ‌దిలేస్తాం. నిజ‌మే.. ఎక్కువ‌గా రోడ్డు మీదే వ‌దిలేస్తాం. కానీ కువైట్ వంటి అర‌బ్ దేశాల్లో అయితే ఇలా పాడైపోయిన టైర్ల కోసం ఓ డంప్ యార్డ్ కేటాయిస్తారు. స‌రిగ్గా అలాంటి ప్ర‌దేశ‌మే కువైట్‌లోనూ ఉంది.

  ఈ డంప్ యార్డ్ లో 40.2 మిలియ‌ర్ల టైర్లు ఉన్నాయంటే న‌మ్మ‌శ‌క్యం కాదు. అంటే 4 కోట్ల 20 ల‌క్ష‌ల వేస్ట్ టైర్లు అన్న‌మాట‌. ఏడు కి.మీ విస్తీర్ణంలో ఈ డంప్ యార్డ్ ఉంది. ఈ యార్డ్ లో ఇప్పుడు ఇన్నికోట్ల పాడైపోయిన టైర్లు ఉన్నాయ‌న్న‌మాట‌. అయితే ఇప్పుడు ఈ టైడ్ డంప్ యార్ట్ లో ఉన్న టైర్లు అన్నింటినీ అక్క‌డి నుంచి త‌ర‌లిస్తున్నారు.

  ఆ ప్ర‌దేశంలో ఇళ్ళు క‌ట్టాల‌నే నిర్ణ‌యంలో అక్క‌డి అధికారులు ఉన్నారు. ఈ నేప‌ధ్యంలో వాడిపారేసిన టైర్ల‌ను మ‌రోటికి త‌ర‌లించే ప్ర‌క్రియ చేప‌ట్టారు. అయితే కువైట్ లోని ఓ కంపెనీ ఈ టైర్ల‌న్నింటినీ రీసైకిల్ చేయాల‌ని భావిస్తోంది. ర‌బ్బ‌ర్ ఫ్లోరింగ్ టైల్స్ గా వాడుక‌లోకి తేవాల‌ని ప్లాన్ చేస్తోంది.

  అంటే టైల్స్ స్థానంలో ర‌బ్బ‌ర్ టైల్స్ ను వినియోగంలోకి తీసుకురావాల‌న్న‌ది స‌ద‌రు కంపెనీ యోచ‌న‌. ఆ దిశ‌గా స‌ద‌రు కంపెనీ కూడా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటోంది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్