కండోమ్ తీస్తే రేప్ కేసు ..

  0
  2410

  లైంగిక చర్యలో ,భార్యకో , ప్రియురాలికో చెప్పకుండా కండోమ్ తీసెయ్యడం ఎంత నేరమో తెలుసా ..? రేప్ చేసిన నేరంతో సమానం.. శిక్షకూడా ఉంటుంది.. ప్రపంచంలో అనేక దేశాలు , లైంగిక చర్య మధ్యలో కండోమ్ తీసేసినా , తనతో ఉన్నమహిళకు తెలియకుండా కండోమ్ కి చిల్లులు పెట్టినా అది శిక్షార్హమైన నేరం. అది నమ్మక ద్రోహంగా పరిగణిస్తారు.

  కండోమ్ స్టెల్తింగ్ ని తీవ్రమైన నేరం

  జర్మనీ , కెనడా , స్విస్ , ఆస్ట్రేలియా తో సహా అనేక యూరప్ దేశాలు , కండోమ్ మోసాన్ని దారుణమైన నేరంగా పరిగణిస్తారు. ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంకూడా , కండోమ్ స్టెల్తింగ్ ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ చట్టం సిద్ధంచేసింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. అమెరికాలో ఇలాంటి బిల్లుతెచ్చిన మొదటి రాష్ట్రంగా నిలిచింది.

  ఆమె జీవితంతో ఆటలాడుకున్నట్టే

  తనతో లైంగిక సంబంధానికి సిద్ధపడ్డ మహిళ , కండోమ్ ఉండాలని షరతు పెడితే , మగాడు దాన్ని అతిక్రమించి మోసం చేయకూడదని , రతి మధ్యలో కండోమ్ తీసేసినా , చిల్లులు పడ్డ కండోమ్ వేసుకున్నా , ఆమె జీవితంతో ఆటలాడుకున్నట్టేనని స్విస్ కోర్టు ఇదివరకే తీర్పు చెప్పింది. ఇలాంటి చర్యలవల్ల , మహిళలకు అవాంఛిత గర్భం వచ్చే అవకాశం ఉందని , ఎయిడ్స్ , మరియు ప్రమాదకరమైన సుఖవ్యాధులు రావచ్చునన్న భయంతో , మహిళలు రతి సమయంలో కండోమ్ ఉండాలని షరతు పెట్టడం న్యాయమని కూడా చెప్పింది…

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  https://youtu.be/a6Vner0Vd5c