ఈ బైక్ చూస్తే..గర్ల్ ఫ్రెండ్ ను వదిలేస్తారు.

  0
  167

  ఈ బైక్ చూస్తే..
  గర్ల్ ఫ్రెండ్ ను కూడా వదిలేస్తారు..
  =====================
  ప్రపంచ మార్కెట్లోకి రోజుకో కొత్త బైక్ వచ్చేస్తోంది. ఇలా వస్తున్న బైక్స్ అన్నీ సరికొత్త లుక్స్ తో కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే క్రూజర్ శ్రేణిలో ఎన్నో బైక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా చైనాలో జేడీ మోటార్స్ విజన్ 750 స్పోర్ట్స్ బైక్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ ను గత ఏడాదే ప్రదర్శించినప్పటికీ.. తాజాగా డీలర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

  ఈ విజన్ 750 స్పోర్ట్స్ బైక్ అత్యంత శక్తివంతమైన 730 సీసీ లిక్విడ్ కూల్ ఇంజిన్ తో వస్తుంది. దీంతో పాటుగా అత్యాధునిక సౌకర్యాలను కూడా ఈ స్పోర్ట్స్ బైక్ లో పొందుపరిచారు. లాంగ్ డ్రైవ్స్ కోసం అనుకూలంగా ఉండేలా అతిపెద్ద డిస్ప్లై సిస్టం అమర్చారు. ఈ విజన్ 750 TFT డిస్ప్లే స్పోర్ట్స్ బైక్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.

  దీంతో పాటుగా కీలెస్ ఇగ్నిషన్ సిస్టం మరొక ప్రత్యేకతగా చెప్పచ్చు. స్క్రీన్ పైనే ఫ్యూయల్ డిస్ప్లే కూడా ఇచ్చారు. వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు టెంపరేచర్ కూడా అందులోనే చూపించేలా ఏర్పాటు చేశారు. టైం, గేర్ పొజిషన్ కూడా అందులోనే కనిపిస్తుంది. ఇలా ఎన్నో రకాలైన సౌకర్యాలను జేడీ మోటార్స్ ఈ స్పోర్ట్స్ బైక్ లో తీసుకొచ్చింది. ప్రధానంగా లుక్స్ పరంగా చైనా యువతను ఈ స్పోర్ట్స్ బైక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇండియాలో ఈ బైక్ ఎప్పుడు లాంచ్ చేస్తారో అనే విషయంపై మాత్రం కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.