నలుపు చారల చిరుతపులి..
ప్రపంచంలో ఎక్కడా కనిపించదు..
======================
మనదేశంలో పులుల్లో చాలా రకాలు ఉంటాయి. మనం కూడా చాలా రకాలైన పులులను అడవుల్లోనూ.. జూలలోనూ చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి పులిని మాత్రం ఎప్పుడూ చూసిఉండరు. ఎందుకంటే ప్రపంచంలోనే ఈ చిరుతపులి చాలా అరుదైనదిగా చెబుతున్నారు.
నలుపురంగు చారల్లో కనిపించిన చిరుతపులి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా నలుపురంగు చారలు కలిగిన ఈ చిరుత వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ నలుపు చారల చిరుత పులి ఒరిస్సాలో కనిపించింది. అయితే నిజానికి ఇలాంటి పులుల జాతి ఎక్కడా లేదు. కొన్ని జన్యుపరమైన లోపాల కారణంగా ఇలాంటి నలుపు చారలతో కొన్నేళ్ల క్రితం ఓ చిరుత పులి జన్మించింది.
మెల్లగా ఆ పులి తన సంతతిని పెంచుకుంటూ వస్తోంది. దీంతో ఇలా నలుపు రంగు చారలు కలిగిన పులులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు కూడా ఈ నలుపురంగు చారలు కలిగిన చిరుత పులులను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. వాటికోసం ప్రత్యేకంగా అడవిలో నీటివసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిని అరుదైన జాతిగా గుర్తించి.. కాపాడుకుంటున్నారు.
The black tigers of #India. Do you know there are pseudo- melanistic tigers found in Simlipal. They are due to genetic mutation & highly rare. @susantananda3 pic.twitter.com/oEMCqRYKiF
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 30, 2022