సినీ న‌టి జ‌య‌సుధ కాషాయం గూటికి.షరతులతో.

  0
  359

  ప్ర‌ముఖ సినీ న‌టి జ‌య‌సుధ కాషాయం గూటికి చేర‌నున్నారు. ఈనెల 21న అమిత్ షా స‌మ‌క్షంలో ఆమె బీజేపీలోకి చేర‌నున్నట్లు వార్త‌లొస్తున్నాయి. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దుగానీ.. బీజేపీ నేత ఈటెల రాజేంద‌ర్ తో ఆమె సంప్ర‌దింపులు జ‌రిగాయి. అయితే పార్టీలోకి చేర‌తార‌నే నిర్ణ‌యాన్ని జ‌య‌సుధ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అందుకు కార‌ణం ఆమె చేసిన కొన్ని ప్ర‌తిపాద‌న‌లు. త‌న ప్ర‌తిపాద‌న‌ల‌ను అంగీక‌రిస్తే.. బీజేపీలో చేరేందుకు ఆమె రెడీగా ఉన్న‌ట్లు స‌మాచారం.

  2009లో సింకింద్రాబ్ నుంచి పోటీ చేసి జయసుధ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి… 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం ఆమెను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. జ‌య‌సుధ ప్ర‌తిపాద‌న‌లు కాషాయం పెద్ద‌లు ఏమాత్రం అంగీక‌రిస్తార‌నేది తెలియాలి.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.