అంబానీని చంపాలనే ఇంటిముందు మందుపాతర్లతో వ్యాన్..

  0
  354

  ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ హత్యకు ఇస్లామిక్ తీవ్రవాదులు కుట్ర చేశారా..? ఈ అనుమానం నిజమేనన్న నిర్దారణకు పోలీసులు వస్తున్నారు. సాధారణంగా రాజకీయనాయకుల హత్యలకు, బాంబు పేలుళ్లతో సామూహిక హత్యాకాండకు పధకాలు వేసే తీవ్రవాదులు ఈ దఫా ప్రపంచంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ హత్యకు కుట్రచేశారు.

  ముకేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాల వాహనాన్ని ఉంచడం తమ పనేనని ‘జైష్‌-ఉల్‌-హింద్‌’ అనే సంస్థ ప్రకటించుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

  ఈమేరకు టెలిగ్రామ్‌ యాప్‌లో ఆ సంస్థ ఒక మెసేజి పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయి.. ముంబయి పోలీసుల దృష్టికి వచ్చింది. ఇందుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  అంబానీ ఇంటికి సమీపంలో జిలెటిన్‌ స్టిక్స్‌తో కూడిన ఓ వాహనాన్ని గురువారం పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. అంబానీని అంతమొందిచడం ద్వారా , దేశంలో ‘జైష్‌-ఉల్‌-హింద్‌’ సంస్థ ఉనికిని , అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు , దేశ ఆర్థిక వ్యవస్థను కల్లోలం చేయవచ్చుననే అబిప్రాయం ‘జైష్‌-ఉల్‌-హింద్‌’ సంస్థకు ఉండొచ్చునని తెలుస్తోంది .

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??