సలార్ విడుదల తేదీ వెనక ఇంత కథ నడిచిందా…?

  0
  136

  ప్రభాస్ క్రేజీ మూవీ సలార్ విడుదల తేదీ ప్రకటించి సంచలనం సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్-2 ని విడుదలకు ముస్తాబు చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్ ప్రభాస్ సినిమాని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సలార్ విడుదలవుతుందని అఫీషియల్ గా ఓ పోస్టర్ విడుదల చేశాడు.

  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్-2 సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే దాని తర్వాత వచ్చే సినిమాకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం వెనక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. కేజీఎఫ్-2 పై క్రేజ్ పెంచేందుకే ఈ ప్రకటన విడుదల చేశారని అంటున్నారు.

  క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్‌’తో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్‌నీల్‌ సారథ్యంలో ‘బాహుబలి’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ హీరోగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో చిత్రీకరించారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..