దొంగలెక్కల బంగార్రాజు..

  0
  2062

  డబ్బులు ఎవరికి ఊరికే రావు.. అంటూ తనకు తానే యాంకర్ గా మారిన లలితా జ్యుయలరీ యజమాని ఎన్ని మార్గాల్లో అక్రమంగా సంపాదించాడో తెలుసా..? ఎన్ని వందల కోట్లు ఇన్ కమ్ ట్యాక్స్ లెక్కలకు చూపకుండా దాచేశాడో తెలుసా? 3 రోజుల క్రితం ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగినా, పత్రికలు, మీడియాను కరెన్సీతో నోరు కప్పెట్టేసి, కళ్లకు గంతలు కట్టేశాడు. అందుకే లలితా జ్యుయలరీపై ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు అన్న పదమే మీడియాలో ఎక్కడా వినపడలేదు, కనపడలేదు. చెన్నై, ముంబై, కోయంబత్తూర్, మదురై, తిరుచ్చి, త్రిశూర్, జైపూర్, ఇండోర్, నెల్లూరు నగరాల్లో లలితా జ్యుయలరీస్ పై దాడులు జరిగాయి.

  దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు లెక్కలు చూపకుండా దాచేశారని వెల్లడైంది. ఈ దాడుల్లో కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ పార్టీలనుంచి అప్పులు తీసుకున్నట్టు రాసుకోవడం, వారికి తిరిగి వడ్డీతో సహా చెల్లించినట్టు నమోదు చేసుకోవడం, స్థిరాస్థి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, నష్టాలు వచ్చినట్టు రాసుకోవడం, బంగారం మార్పిడిలో, నగలు తయారు చేయడంలో, వేస్టేజీ వచ్చిందని దొంగ లెక్కలు రాయడం, నోట్ల రద్దు సమయంలో డిపాజిట్ల లెక్క తేలకపోవడం, బినామీ వ్యక్తులకు తాము బాకీలున్నట్టు లెక్కలు రాయడం, ఇలా అనేక రకాల మోసాలతో లలితా జ్యుయలరీస్ వందల కోట్ల రూపాయలు ఇన్ కమ్ ట్యాక్స్ కి లెక్కలు చెప్పకుండా దాచిపెట్టింది. దీంతోపాటు శివసాహి అండ్ సన్స్ పై కూడా ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  https://youtu.be/a6Vner0Vd5c