ఐదుపైసల బిర్యానీ ..ఎంత పని చేసిందిరా బాబో..

    0
    7935

    ఐదు పైసలకే బిర్యాని.. ఓ రెస్టారెంట్ చేసిన అనౌన్సమెంట్ , రెస్టారెంట్ వాళ్లనే భయపెట్టింది.. ఎందుకంటే ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం నాటి ఐదు పైసల నాణెం ఇప్పుడెక్కడా దొరకదు అన్న ధీమా .. ఒక వేళ దొరికినా ఐదో పది మందో వస్తారన్న నమ్మకం వాళ్ళ కొంపముంచింది. బిర్యాని అనేసరికి , ఎక్కడవోకానీ వందలమంది ఐదు పైసల బిళ్ళలతో ఉదయాన్నే క్యూలో ఉండిపోయారు. మదురైలో సుకన్య బిర్యానీ సెంటర్ పేరుతొ కొత్త రెస్టారెంట్ ప్రారంభం ఇలా సాగింది. ఐదు పైసల బిర్యానీ కోసం , వందలమంది గుమికూడటంతో రెస్టారెంట్ యజమానులకు అయోమయం కలిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులొచ్చి , కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ అందర్నీ తరిమేసి , రెస్టారెంట్ పై కేసు పెట్టారు. ఐదు పైసళ్ళు ఎక్కువలేవు కదా అని తాము ప్రకటన ఇచ్చామని , ఇంతమంది వస్తారని ఊహించలేదని రెస్టారెంట్ యజమాని చెప్పారు.. బిర్యానీ అంటే ఇంతే.. కొంతమంది ఎంత దూరమైనా వచ్చేస్తారు..

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?