బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నారా..?

  0
  533

  మీరు బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నారా..? ఇటీవల మీకు బ్యాంకు అధికారులు ఫోన్ చేశారా..? తీసుకున్న రుణంలో వెంటనే 10శాతం జమచేయండి అంటూ నోటీసులు పంపిస్తున్నారా..? ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లో బ్యాంకులో బంగారం పెట్టి రుణాలు తీసుకున్న అందరికీ అనుభవంలోకి వచ్చే అంశాలే. అవును… భారీగా పడిపోతున్న బంగారు ధరలు బ్యాంకులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్న కస్టమర్లను కంగారు పెట్టిస్తున్నాయి.

  ఫిబ్రవరి మొదటి వారం నుంచి మొదలైన బంగారం ధరల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ అప్పు తీసుకున్న వారికి ప్రత్యేకంగా నోటీసులు జారీచేస్తున్నాయి. వెంటనే కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

  ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఏపీలో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.51,060 గా ఉంది. అదే నెలాఖరుకు వచ్చేసరికి రూ.49,960కి చేరింది. ఫిబ్రవరి 1న రూ.49,640 కాగా, ఫిబ్రవరి నెల 28వ తేదీకి రూ.46,570కి పడిపోయింది. మార్చి ఒకటిన రూ.46,580 ఉండగా, మహిళా దినోత్సవమైన 8వ తేదీన రూ.45,820కి చేరింది.

  అంటే జనవరి 1న ఉన్న రేటుకి, ఫిబ్రవరి 8న రేటుకి సుమారు 6వేల రూపాయల తేడా ఉంది. ఈ పతనం ఇక్కడితో ఆగేలా లేదు. ఇంకెంతగా బంగారం ధరలు పడిపోతాయోనని మార్కెట్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మరికొన్ని ఇతర బ్యాంకులు బంగారంపై అప్పు తీసుకున్న వారికి పరిస్థితిని వివరిస్తూ నోటీసులు జారీచేస్తున్నాయి. మార్కెట్‌ రేటు తగ్గినందున, తీసుకున్న రుణంలో 10శాతం వెంటనే చెల్లించి, ఆ మేరకు పెరిగిన రుణభారం తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..