చిరిగిన జీన్స్ వేసుకుంటే లైంగిక వేధింపులు..

  0
  138

  యువత చిరిగిన జీన్స్ వేసుకుని, మోకాళ్లు చూపెడుతూ ఉంటే, లైంగిక వేధింపులు ఎందుకు ఆగుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్. ఇలాంటి వస్త్రధారణ సమాజానికి చెడు సంకేతాలు పంపుతుందని అన్నారు. బాలల హక్కులపై జరిగిన ఓ వర్క్ ‌షాప్ ‌లో పాల్గొన్న సీఎం రావత్.. చిన్నారులను ఇలాంటి సంస్కృతినుంచి దూరంగా ఉంచాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని చెప్పారు. సరైన సంస్కృతి, పద్ధతుల్లో పెంచితే వారు ఎంత ఆధునికంగా వ్యవహరించినా జీవితంలో విఫలం కారని చెప్పారు. స్త్రీల హక్కులు, పిల్లల హక్కులు, ఇతర కారణాలతో పోరాటాలు చేసే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా చిరిగిన జీన్స్ ధరించడాన్ని తాను చూశానని, ఓ ఎన్జీఓ అధిపతిగా అలాంటి మహిళలు సమాజానికి ఎలాంటి సందేశాలు పంపుతున్నారని వ్యాఖ్యానించారు రావత్.

  యువత ఫ్యాషన్‌ పేరుతో చిరిగిన జీన్స్‌ ధరించడం సమాజ విచ్ఛిన్నానికి దారితీస్తుందని చెప్పారాయన. ఇలాంటి పెడ పోకడల వల్లే లైంగిక వేధింపులు, డ్రగ్స్‌ వాడకం వంటి పరిణామాలు జరుగుతున్నాయని అన్నారు. యువతీ యువకులు మోకాళ్లను చూపే జీన్స్‌ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమేనని అన్నారు. పాశ్చాత్య ప్రపంచం మనల్ని అనుసరిస్తూ యోగ చేస్తూ శరీరాన్ని పూర్తిగా కప్పే వస్త్రాలను ధరిస్తుంటే మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని అన్నారు సీఎం రావత్.

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.