బైక్ స్టంట్ చేసిన అమ్మాయికి 28 వేలు ఫైన్ .

  0
  155

  మ‌గాళ్ళే కాదు ఆడాళ్ళు బైక్ స్టంట్స్ చేయ‌గ‌ల‌రు. బైక్ స్టంట్స్ అంటే అలా ఇలా కాదు. హెవీ ట్రాఫిక్ ఉన్న స‌మ‌యంలో బైక్ స్టంట్లు చేసి ఇద్ద‌రు అమ్మాయిలు పోలీసుల‌కు చిక్కారు. 28వేల రూపాయ‌ల ఫైన్ చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఆ యువ‌తులు చేసిన బైక్ స్టంట్లు వీడియోలు తీసుకుని, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి పోలీసుల‌కు చిక్కారు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఘ‌జియాబాద్ లో జ‌రిగింది.

  శివంగి, స్నేహ అనే ఇద్ద‌రు యువ‌తులు బైక్ స్టంట్లు చేయాల‌న్న ఆలోచ‌న‌తో రోడ్డు మీద‌కి వ‌చ్చారు. స్నేహ‌, శివంగిని భుజాల‌పై కూర్చో పెట్టుకుని బైక్ న‌డిపింది. స్టంట్ అయితే విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. ఇంటికి వ‌చ్చాక 28వేల రూపాయ‌ల ఫైన్ క‌ట్టాలంటూ మొబైల్ కు మెసేజ్ వ‌చ్చింది. విచిత్ర‌మేమంటే ఈ ఇద్ద‌రు యువ‌తుల‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదు… బండికి నెంబ‌ర్ ప్లేట్ కూడా లేదు. ఈ స్టంట్ ను సోష‌ల్ మీడియాలో చూసిన పోలీసులు, విచార‌ణ చేప‌ట్టి ఆ బైక్ ఎవ‌రిదో తెలుసుకుని ఫైన్ వేసిన చ‌లానాను ఆ యువ‌తి మొబైల్ ఫోన్ కు పంపించారు.

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..