భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  0
  3527

  భార్యలను మార్చుకునే నీచమైన సంస్కృతికి బెంగళూరులో మరో మహిళ బలైపోయింది. దీంతో బెంగుళూరులో భార్యలను మార్చుకునే దారుణాలకు సంబంధించి గతంలో జరిగిన వికృత సాంప్రదాయాలు ఇంకా పోలేదని స్పష్టమైపోయింది. బెంగుళూరు కేఆర్ పురం కు చెందిన పద్మావతి అనే వివాహితను , భర్త భాస్కర్ , తన ఫ్రెండ్స్ తో , పడక పంచుకోమని వత్తిడి చేసేవాడు. ఆమె నిరాకరించడంతో కొట్టేవాడు. గతంలో మూడు దఫాలు ఈ కారణం మీదనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. గతనెలలో ఒక పార్టీకి వెళ్ళినప్పుడు , తన ఫ్రెండ్ తో కలిసి తాగాలని , అతనితో రాత్రి గడపాలని కోరాడు. దానికి ఒప్పుకోకుండా ఆమె ఇంటికొచ్చేసింది. భర్త , భాస్కర్ రాత్రి ఇంటికొచ్చి ఆమెను కొట్టి చంపేశాడని తల్లి లీలావతి ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో ఉంది.

   

  బెంగుళూరులో గతంలో కూడా , ఓ వివాహిత , తన స్నేహితురాలిని , తన భర్తతో పడుకోమని వత్తిడి చేసేది. లేదంటే నీ భర్తను చంపిస్తానని బెదిరించేది. దీంతో ఆమె , భర్త కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో విచిత్ర ఘటనలో , ఇద్దరు స్నేహితులు పెళ్లాలను అప్పుడప్పుడూ మార్చుకునేవాళ్ళు. వారిలో ఒకరు ఇంజినీర్ కాగా , మరొకరు క్లాస్ వన్ కాంట్రాక్టర్ . కొన్నాళ్ళకు కాంట్రాక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కాంట్రాక్టర్ భార్య , ఇంజినీరును తన భార్యకు విడాకులిచ్చి , తనతోనే ఉండాలని కోరింది. ఈ విషయం పోలీసు స్టేషన్ వరకు చేరింది. పోలీసులు ముగ్గురికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినా ఇంకా ఈ సమస్య వారి మధ్య నాలుగుతూనే ఉంది. బెంగుళూరులో వైఫ్ స్వాపింగ్ పేరుతొ , వెబ్ సైట్లు కూడా ఉండటం విచిత్రం. ముంబై, కేరళ , చెన్నై, ఢిల్లీ ఇలా దాదాపు చాలా నగరాలలో వైఫ్ స్వాపింగ్ నీచ సంస్కృతి ఉంది.

  రెండేళ్ల క్రితం ముంబైలో ఓ మహిళ , పెద్ద వ్యాపారవేత్త అయిన తన భర్త అతడి ముగ్గురు స్నేహితులను , 39 ఏళ్ళ తనను రేప్ చేయాల్సిందిగా కోరాడంటూ కేసు పెట్టింది. భార్యల మార్పిడికి తాను ఒప్పుకోకపోవడంతో ఇలా చేసాడని కేసుపెట్టింది. కేరళలోని కాయంకుళం కోర్టు వైఫ్ స్వాపింగ్ కేసులో నలుగురిని జైలుకు పంపింది. షేర్ చాట్ లో పరిచయమైన నలుగురు ఫ్రెండ్స్ తో పడుకోమని తన భర్త వత్తిడి చేస్తున్నాడని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను వాళ్ళతో సెక్స్ చేస్తే , వాళ్ల భార్యలను తనవద్దకు పంపుతారని చెప్పారని భర్త వత్తిడి చేయడంతో ఆమె కేసుపెట్టి , భర్తతో సహా ఆ నలుగురిని గత ఏడాది జైలుకి పంపింది. ఇలాంటి వికృత సాంప్రదాయం నగరాలలో చాప కింద నీరులా విస్తరిస్తోంది.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??