చరిత్రలో రెండోసారి.. మక్కాలో ఇలా..

    0
    400

    ముస్లింల మక్కా పవిత్ర యాత్ర కరోనా కారణంగా రద్దీ లేకుండా జరిగింది. మక్కా సందర్శనలో భాగంగా జరిగే కాబా గృహ సందర్శనకు కేవలం 60వేలమందిని మాత్రమే సౌదీ ప్రభుత్వం అనుమతించింది. బయటి దేశాలవారికి అనుమతి లేకుండా కేవలం సౌదీ స్థానికులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

    రెండేళ్ల క్రితం మక్కాయాత్రకు రెండున్నరకోట్ల మంది తరలి వచ్చారు. ఈ ఏడాది కేవలం 60వేల మందికి మాత్రమే అనుమతిచ్చారు. మొత్తం 5,58,000మంది దరఖాస్తు చేసుకోగా వారిలో లాటరీ ద్వారా 60వేల మందికి అనుమతి ఇచ్చారు. ఆ లాటరీకి కూడా గోల్డెన్ లాటరీ అని పేరు పెట్టారు. రెండు డోసులు వ్యాక్సన్ తీసుకున్నవారికి మాత్రమే మక్కా యాత్రకు అనుమతించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు, ఇతరత్రా జబ్బులేవీ వారికి ఉండకూడదు. 18ఏళ్లనుంచి 60ఏళ్లలోపు వారిని మాత్రమే యాత్రకు అనుమతించారు.

    కాబా హౌస్ చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు ప్రత్యేక వరుసలు ఏర్పాటు చేశారు. ఈ వరుసలలో ప్రతి మూడు గంటలకు 6వేలమందిని వదులుతారు. వారు వెళ్లిపోయాక ప్రత్యేకంగా ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తారు. ఆ తర్వాత మరో బ్యాచ్ ని వదులుతారు. మక్కా చరిత్రలోనే ఈసారి ఎలాంటి రద్దీ లేకుండా ప్రశాంతంగా యాత్ర జరిగింది. అన్నిచోట్లా కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ యాత్రని చేపట్టారు.

     

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?