ప్రియుడి బైక్ వెనుకే కూర్చుని కత్తితో పొడిచి చంపేసింది..శవం పక్కనే కూర్చుండిపోయింది.

    0
    816

    కాలం మారిపోతోంది. ప్రేమ‌లో మోసం చేస్తే అమ్మాయిల‌ను అబ్బాయిలు చంపే కాలం పోయి, ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిల‌ను చంపే కాలం దాపురించింది. ప్రేమించి పెళ్ళికి నిరాకరించాడ‌న్న కార‌ణంతో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మ‌ల‌క‌ల‌ప‌ల్లికి చెందిన పావ‌ని అనే యువ‌తి, త‌న ప్రియుడు తాతాజీని క‌త్తితో పొడిచి ఘోరంగా చంపింది. రెండేళ్ళుగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. ఏడాదిగా ఆమె పెళ్ళి చేసుకోవాల‌ని కోరుతున్నా, తాతాజీ నిరాక‌రిస్తూ వ‌చ్చాడు. అయితే సోమ‌వారం మ‌ద్యాహ్నం తాతాజా పంగిడి అనే గ్రామానికి వ‌చ్చాడు. మ‌ల‌క‌ల‌ప‌ల్లి నుంచి పావ‌ని అత‌ని వ‌ద్ద‌కు వెళ్ళింది. రాత్రి వ‌ర‌కు ఇద్ద‌రూ క‌లిసిమెలిసి తిరిగారు. తాతాజీ ఆమెను ఇంటి వ‌ద్ద‌కు దించేందుకు వెళ్తుండ‌గా, బైక్ వెన‌క కూర్చున్న పావ‌ని, త‌న బ్యాగులో ఉన్న క‌త్తిని తీసి అత‌ని వీపుపై పొడిచింది. కింద ప‌డిపోయిన తాతాజీని లేచేందుకు కూడా అవ‌కాశం ఇవ్వ‌కుండా తాతాజీని క‌సితీరా చంపేసి అత‌ని ప‌క్క‌నే కూర్చుంది. స్థానికులు ఈ దారుణాన్ని చూసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.