విజయవాడ చేరుకున్న కరోనా వ్యాక్సిన్..

    0
    139

    తొలిదశ వ్యాక్సిన్‌ రవాణాలో భాగంగా కొవిషీల్డ్‌ టీకా డోసులు పుణె నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ప్రత్యేక బందోబస్తుతో గవర్నరంలోని రాష్ట్ర వ్యాధినిరోధక భవనానికి తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిదశలో భాగంగా 4.75 లక్షల మందికి కొవిషీల్డ్‌ టీకా అందిస్తారు. మొదటి విడత ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ చేస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ తెలిపారు. జనవరి 16నుంచి టీకా పంపిణీ మొదలవుతుంది.