1075 మంది ఉంపుడుగత్తెలు.. వెయ్యేళ్ళు జైలు శిక్ష .

    0
    1092

    వీడు సామాన్యుడు కాదు . మతం ముసుగులో విచ్చలవిడి సెక్స్ కు బానిస . తనకు 1075 మంది ఉంపుడుగత్తెలున్నారని బహిరంగంగా ప్రకటించాడు. ఇస్లామిక్ క్రియేషలిస్టు గా తనకుతాను చెప్పుకొంటూ టర్కీలో అనేక ఘోరాలు , నేరాలకు పాల్పడ్డ అడ్నాని ఒక్టర్ కి టర్కీ కోర్టు వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అతడి అనుచరులైన మరో 196 మందికి వందనుంచి మూడొందల ఏళ్ళు జైలు శిక్ష వేసింది. అమాయకులైన మహిళలు , మైనర్ ఆడపిల్లలను తన వికృత లైంగిక వాంఛలకు వాడుకోవడం , దేశద్రోహం , కుట్ర తదితర నేరాలపై ఈ శిక్షలు వేశారు. ఒక్టర్ కు A 9 అనే టివి ఛానెల్ కూడా ఉంది. ఆయన రాసిన 300 పుస్తకాలను 73 భాషల్లో ట్రాన్స్లేట్ చేసాడు .
    తన భావాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన ఒక ప్రత్యేకమైన ఇస్లామిక్ తెగకు ఇతడు మతబోధకుడుగా కూడా ఉన్నాడు. జస్టిస్ అండ్ డెవెలెప్మెంట్ అనే రాజకీయపార్టీని కూడా స్థాపించాడు..